Telugu Global
NEWS

ఆమెకు, ఎస్వీబీసీకి సంబంధం లేదు...

బాబోయ్ మా పరువు కాపాడండీ అని వేడుకుంటున్నారు టీటీడీ ఆధీనంలోని ఎస్వీబీసీ ఛానల్‌ మహిళా ఉద్యోగులు. ఇదే విన్నపంతో ఛానల్ కార్యనిర్వాహక అధికారికి లేఖ రాశారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీతో ఫోన్ కాల్‌ లీక్‌ కావడంతో ప్రస్తుతం ఛానల్‌లో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. మాజీ చైర్మన్‌ పృధ్వీతో ఫోన్ మాట్లాడిన మహిళను ఎప్పుడో విధుల నుంచి తప్పించారు. కానీ.. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అది మీరేనా.. మీరేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు […]

ఆమెకు, ఎస్వీబీసీకి సంబంధం లేదు...
X

బాబోయ్ మా పరువు కాపాడండీ అని వేడుకుంటున్నారు టీటీడీ ఆధీనంలోని ఎస్వీబీసీ ఛానల్‌ మహిళా ఉద్యోగులు. ఇదే విన్నపంతో ఛానల్ కార్యనిర్వాహక అధికారికి లేఖ రాశారు.
ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీతో ఫోన్ కాల్‌ లీక్‌ కావడంతో ప్రస్తుతం ఛానల్‌లో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది.

మాజీ చైర్మన్‌ పృధ్వీతో ఫోన్ మాట్లాడిన మహిళను ఎప్పుడో విధుల నుంచి తప్పించారు. కానీ.. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అది మీరేనా.. మీరేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు మహిళలు. ఉన్నదే 32మంది ఉద్యోగినులు. ఈ ఫోన్‌ కాల్స్‌తో తల ఎత్తుకోలేకపోతున్నామని లేఖలో రాశారు.

ఫోన్ కాల్‌లో మాట్లాడిన మహిళ ఇప్పుడు ఎస్వీబీసీలో ఉద్యోగిని కాదన్న విషయాన్ని ప్రచారం చెయ్యాలని.. అప్పుడైనా ఫోన్‌ కాల్స్ ఆగుతాయని వేడుకుంటున్నారు ఉద్యోగినులు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు పుథ్వీఫోన్‌ కాల్‌పై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఫోన్‌కాల్స్ వెనుక ఎవరున్నారు? అసలు ఆ ఉద్యోగిని పుథ్వీకి ఎందుకు కాల్‌ చేసింది. దీని వెనుక ఏం జరిగింది? కొత్తగా 32 మంది ఉద్యోగుల ఎంపిక ఎలా జరిగింది? అనే విషయాలపై పూర్తి నివేదిక రెడీ చేస్తున్నట్లు సమాచారం.

First Published:  18 Jan 2020 12:30 AM GMT
Next Story