రాజ‌ధాని క్యాంపెయిన్‌లో వైసీపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారా ?

మూడు రాజ‌ధానులు, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో వైసీపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారా? అంటే అవున‌నే స‌మాధానం ప‌రిశీల‌కుల‌ను వ‌చ్చి వ‌స్తోంది. రాజ‌ధానిని మార్చ‌డం లేద‌ని… కేవ‌లం ప‌రిపాల‌నను మూడుప‌ట్ట‌ణాల‌కు విస్త‌రిస్తున్నామ‌నే వాద‌న వినిపించ‌డంలో వైసీపీ నేత‌లు వెనకబడ్డార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి అమ‌రావతిలో అసెంబ్లీ, ఇత‌ర ఆఫీసులు కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చెప్పింది. కేవ‌లం కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ మాత్ర‌మే విశాఖ‌కు త‌ర‌లుతుంద‌ని… క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించింది. అయితే ఈ అంశాన్ని జ‌నంలోకి తీసుకెళ్ల‌డంలో వైసీపీ నేత‌లు చొర‌వ చూప‌లేక‌పోయార‌ట‌. దీంతో సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకుని ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మావేశాలు, ఇత‌ర మీటింగ్‌లు పెట్టాల‌ని పార్టీ శ్రేణుల‌ను ఆదేశించార‌ట‌. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు ర్యాలీలు నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం.

ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు మ‌రింత చేరువ‌గా తీసుకెళ్లేందుకు ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ ఉపయోగ‌ప‌డుతుందని… తెలంగాణలో జిల్లాల విభ‌జ‌న త‌ర్వాత ఇదే జ‌రిగిందని… కలెక్ట‌ర్లు అందుబాటులో ఉండ‌డంతో చాలా స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం దొరికిందని… గ‌తంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా ప‌రిపాల‌న మ‌రింత చేరువ చేసేందుకు మండ‌ల వ్య‌వ‌స్థ తీసుకొచ్చారని… ఇప్పుడు ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌రిగితే ఏపీలో కూడా అదే జ‌రుగుతోందని చెప్పారట.

ద‌క్షిణాఫ్రికా మూడురాజ‌ధానుల వ్య‌వ‌స్థ ఇక్క‌డ అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు. కేవ‌లం అధికార‌ వికేంద్ర‌కర‌ణ మాత్ర‌మే జరుగుతుంది. కానీ కొన్ని మీడియా సంస్థ‌లు, టీడీపీ నేత‌లు ఈ అంశాన్ని గంద‌ర‌గోళం చేశారు. అమ‌రావ‌తికి వైసీపీ వ్య‌తిరేకం అనే క‌లరింగ్ ఇచ్చారు.

అయితే ఈ ప్ర‌చారాన్ని వైసీపీ నేత‌లు తిప్పికొట్ట‌డంలో ఆల‌స్య‌మైంది, అయితే ఇప్పుడు తేరుకున్న నేత‌లు రాజ‌ధాని వాసుల్లో ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. మొత్తానికి త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో పూర్తి క్లారిటీ వ‌చ్చి…అన్ని స‌మ‌స్య‌లు స‌ర్దుకుంటాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.