Telugu Global
NEWS

భారత్-ఆస్ట్ర్రేలియా సూపర్ సండే ఫైట్

ఆఖరివన్డే నెగ్గినజట్టుకే సిరీస్ ట్రోఫీ వన్డే క్రికెట్ దిగ్గజాలు భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో..బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఆఖరిపోరాటం…రెండుజట్లకూ నిర్ణయాత్మకంగా మారింది. ముంబై వేదికగా ముగిసిన తొలివన్డేలో కంగారూజట్టు 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేస్తే…రాజ్ కోట వేదికగా జరిగిన రెండోవన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో నెగ్గి బదులుతీర్చుకొంది. రెండుజట్లకూ డూ ఆర్ డై… బెంగళూరు మ్యాచ్ […]

భారత్-ఆస్ట్ర్రేలియా సూపర్ సండే ఫైట్
X
  • ఆఖరివన్డే నెగ్గినజట్టుకే సిరీస్ ట్రోఫీ

వన్డే క్రికెట్ దిగ్గజాలు భారత్-ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. మొదటి రెండువన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో..బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఆఖరిపోరాటం…రెండుజట్లకూ నిర్ణయాత్మకంగా మారింది.

ముంబై వేదికగా ముగిసిన తొలివన్డేలో కంగారూజట్టు 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేస్తే…రాజ్ కోట వేదికగా జరిగిన రెండోవన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో నెగ్గి బదులుతీర్చుకొంది.

రెండుజట్లకూ డూ ఆర్ డై…

బెంగళూరు మ్యాచ్ లో నెగ్గినజట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో …రెండుజట్లూ విజయమేలక్ష్యంగా సమరానికి సిద్ధమయ్యాయి. బ్యాటింగ్ కు అనువుగా ఉన్న చిన్నస్వామి స్టేడియం పిచ్ పైన పరుగుల మోతతో పాటు హైస్కోరింగ్ సమరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

భారతగడ్డపై ఆడిన గత ఐదువన్డేల్లో నాలుగు విజయాలు సాధించిన ఆత్మవిశ్వాసంతో కంగారూ జట్టు..బరిలోకి దిగుతోంది. పేసర్ రిచర్డ్ సన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి.

కొహ్లీకి జంపా గండం…

ప్రపంచ క్రికెట్ టాప్ ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీని ఇప్పటికే ఏడుసార్లు పడగొట్టిన కంగారూ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా…ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేల్లోనూ.. కొహ్లీ వికెట్ ను తన ఖాతాలో వేసుకోగలిగాడు. బెంగళూరులో సైతం భారత కెప్టెన్ కు పగ్గాలు వేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఓపెనర్లు వార్నర్, ఫించ్ తో పాటు వన్ డౌన్ స్మిత్, రెండో డౌన్ మార్నుస్ సూపర్ ఫామ్ లో ఉండడం…భారత్ బౌలింగ్ సత్తాకు పరీక్షకానుంది.

ధావన్ పిట్… రోహిత్ డౌట్..

మరోవైపు..రెండోవన్డే ఆడుతూ గాయపడిన భారత ఓపెనర్లలో శిఖర్ ధావన్ పూర్తి ఫిట్ గా ఉన్నట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. అయితే…రోహిత్ భుజం గాయం గురించి ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు.

ధావన్, కెప్టెన్ కొహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రాహుల్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉండడంతో ఆతిథ్య భారత్ మరోసారి 340కి పైగా స్కోరు సాధించగలనన్న ధీమాతో ఉంది.

ఆఖరివన్డేలో సైతం మంచుప్రభావం ఉండడంతో …టాస్ కీలకం కానుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేసే జట్టుతో పాటు…బౌలర్ల సహనానికి మంచు పరీక్షేకానుంది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో సైతం 600కు పైగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని క్యూరేటర్ అంటున్నారు. ఈ సూపర్ సండే ఫైట్.. దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు పరుగులవిందే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  18 Jan 2020 9:00 PM GMT
Next Story