Telugu Global
NEWS

విరాట్ ను ఊరిస్తున్న జంట ప్రపంచ రికార్డులు

ఒక్క సెంచరీతో రెండు రికార్డులకు గురి భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ జంట ప్రపంచ రికార్డులకు గురిపెట్టాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే ఆఖరి వన్డేలో కొహ్లీ ఒక్క సెంచరీ సాధించగలిగితే..కంగారూ గ్రేట్ రికీ పాంటింగ్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేర్లతో ఉన్న వేర్వేరు ప్రపంచ రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. కెప్టెన్ గా అత్యధిక శతకాల రికార్డు… క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 41 శతకాలు బాదిన కెప్టెన్ […]

విరాట్ ను ఊరిస్తున్న జంట ప్రపంచ రికార్డులు
X
  • ఒక్క సెంచరీతో రెండు రికార్డులకు గురి

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ జంట ప్రపంచ రికార్డులకు గురిపెట్టాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే ఆఖరి వన్డేలో కొహ్లీ ఒక్క సెంచరీ సాధించగలిగితే..కంగారూ గ్రేట్ రికీ పాంటింగ్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేర్లతో ఉన్న వేర్వేరు ప్రపంచ రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.

కెప్టెన్ గా అత్యధిక శతకాల రికార్డు…

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 41 శతకాలు బాదిన కెప్టెన్ గా రికీ పాంటింగ్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించడానికి విరాట్ ఉరకలేస్తున్నాడు.

టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి….రికీ పాంటింగ్ కు కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లో 41 శతకాలు బాదిన రికార్డు ఉంది. విరాట్ కొహ్లీకి మాత్రం… కేవలం 196 ఇన్నింగ్స్ లోనే 40 సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమైన కొహ్లీ… తన రెండో హోం గ్రౌండ్ బెంగళూరులో ఒక్క సెంచరీ సాధించినా… రికీ పాంటింగ్ పేరుతో ఉన్నప్రపంచ రికార్డును అధిగమించడంతో పాటు …సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం లేకపోలేదు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన డే-నైట్ టెస్టులో కొహ్లీ శతకం సాధించడం ద్వారా కెప్టెన్ గా 41 సెంచరీల పాంటింగ్ ప్రపంచ రికార్డును సమం చేయగలిగాడు.

కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఇప్పటి వరకూ సాధించిన 41 సెంచరీలలో 21 వన్డే, 20 టెస్టు శతకాలు ఉన్నాయి.

మాస్టర్ రికార్డు వైపు కొహ్లీ చూపు…

భారతగడ్డపై అత్యధిక వన్డే శతకాలు సాధించిన రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. వన్డే క్రికెట్లో సచిన్ సాధించిన మొత్తం 49 శతకాలలో 20 సెంచరీలు భారతగడ్డపైనే సాధించినవే కావడం విశేషం. ఈ రికార్డును సమం చేయాలంటే ఇప్పటికే స్వదేశీగడ్డపై 19 సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీ మరొక్క శతకం బాదితే చాలు.

సచిన్ 20, కొహ్లీ 19 శతకాలు…

సచిన్ తన సుదీర్ఘ కెరియర్ లో 463 వన్డేలు ఆడి ..49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో సహా 18వేల 426 పరుగులు సాధించాడు. మొత్తం 49 వన్డే శతకాలలో.. 20 స్వదేశీగడ్డపైన, 19 విదేశీ గడ్డపైన సాధించాడు.

భారత కెప్టెన్, ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి మాత్రం 2020 సీజన్ రెండో వన్డే వరకూ ఆడిన మొత్తం 244 వన్డేలలో 43 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 11 వేల 700 పరుగులు నమోదు చేశాడు.

కొహ్లీ సాధించిన 43 వన్డే శతకాలలో 19 సెంచరీలు భారతగడ్డపైన సాధించినవే కావడం విశేషం. బెంగళూరు వన్డేలో కొహ్లీ ఒక్క సెంచరీతో రెండు అరుదైన రికార్డులు సాధించగలడా?…వేచిచూడాల్సిందే.

First Published:  18 Jan 2020 9:47 PM GMT
Next Story