Telugu Global
NEWS

వన్డే 100 వికెట్ల క్లబ్ లో కుల్దీప్

రాజ్ కోట వన్డేలో కుల్దీప్ షో వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండోవన్డేలో ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కోరీని అవుట్ చేరడం ద్వారా కుల్దీప్ వికెట్ల సెంచరీని పూర్తి చేయగలిగాడు. హర్భజన్ ను మించిన కుల్దీప్.. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 76 మ్యాచ్ […]

వన్డే 100 వికెట్ల క్లబ్ లో కుల్దీప్
X
  • రాజ్ కోట వన్డేలో కుల్దీప్ షో

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండోవన్డేలో ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కోరీని అవుట్ చేరడం ద్వారా కుల్దీప్ వికెట్ల సెంచరీని పూర్తి చేయగలిగాడు.

హర్భజన్ ను మించిన కుల్దీప్..

భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 76 మ్యాచ్ ల్లో 100 వికెట్లు పడగొడితే…కుల్దీప్ మాత్రం 58 మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోగలిగాడు.

భారత ఇతర బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ల జోడీ బుమ్రా 57 మ్యాచ్ ల్లోనూ, మహ్మద్ షమీ 56 మ్యాచ్ ల్లోనూ వంద వికెట్ల రికార్డును చేరుకోగలిగారు.

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు ఆఫ్గన్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్ పేరుతో ఉంది. రషీద్ ఖాన్ కేవలం 44 మ్యాచ్ ల్లోనే వంద వికెట్ల మొనగాడిగా నిలిచాడు.

కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 52 మ్యాచ్ లు, సక్లెయిన్ ముస్తాక్ 53 మ్యాచ్ ల్లోనూ 100 వికెట్లు సాధించిన బౌలర్లుగా రికార్డుల్లో చేరారు.

First Published:  19 Jan 2020 12:08 AM GMT
Next Story