రాజ్ తరుణ్ సినిమా రెడీ

ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో సినిమా రెడీ చేశాడు. ఈ సినిమా పేరు ఒరేయ్ బుజ్జిగా. గతంలో గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పాపులర్ అయిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకు దర్శకుడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీని సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మాళవికా నాయర్ నటిస్తోంది. ఓ ప్రత్యేక పాత్ర కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. రాజ్ తరుణ్, హెబ్బా కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా హెబ్బాను తీసుకున్నారు. అనూర్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో తన ఫ్లాపుల సంఖ్యను మరింత పెంచుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు తన ఆశలన్నీ ఈ కొత్త సినిమా ఒరేయ్ బుజ్జిగాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కొత్త ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.