Telugu Global
NEWS

హాకీ ప్రో లీగ్ లోహాలెండ్ పై భారత్ మరో గెలుపు

పెనాల్టీ షూటౌట్లో 3-1తో విజయం ప్రపంచ హాకీ సమాఖ్య ప్రో-లీగ్ రెండంచెల పోటీలో మూడో ర్యాంకర్ హాలెండ్ ను 5వ ర్యాంకర్ భారత్ రెండోసారి ఓడించి…2 పాయింట్లు సొంతం చేసుకొంది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె పోటీలో రెండుజట్లూ చెరో 3 గోల్స్ చొ్ప్పున సాధించి సమఉజ్జీలుగా నిలవడంతో.. పెనాల్టీ షూటౌట్ పాటించారు. ఇందులో భారత్ 3-1తో నెగ్గి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తన ఖాతాలో 2 పాయింట్లు జమచేసుకోగలిగింది. తొలి […]

హాకీ ప్రో లీగ్ లోహాలెండ్ పై భారత్ మరో గెలుపు
X
  • పెనాల్టీ షూటౌట్లో 3-1తో విజయం

ప్రపంచ హాకీ సమాఖ్య ప్రో-లీగ్ రెండంచెల పోటీలో మూడో ర్యాంకర్ హాలెండ్ ను 5వ ర్యాంకర్ భారత్ రెండోసారి ఓడించి…2 పాయింట్లు సొంతం చేసుకొంది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె పోటీలో రెండుజట్లూ చెరో 3 గోల్స్ చొ్ప్పున సాధించి సమఉజ్జీలుగా నిలవడంతో.. పెనాల్టీ షూటౌట్ పాటించారు. ఇందులో భారత్ 3-1తో నెగ్గి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తన ఖాతాలో 2 పాయింట్లు జమచేసుకోగలిగింది.

తొలి అంచె పోటీలో డచ్ జట్టును 5-2 గోల్స్ తో చిత్తు చేసిన భారత్ …రెండో అంచెలోనూ విజేతగా నిలవడం ద్వారా తన ఆధిక్యాన్ని నిరూపించుకొంది.

భారత ఆటగాళ్లలో లలిత్ ఉపాధ్యాయ, మన్ దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ తలో గోలు సాధించారు.

షూటౌట్ లో వివేక్ సాగర్, ఆకాశ్ దీప్, గుర్జంత్ సింగ్ తలో గోల్ సాధించారు.

ఏప్రిల్ 25, 26 తేదీలలో జర్మనీతో జర్మనీ వేదికగాను, మే 2, 3 తేదీలలో గ్రేట్ బ్రిటన్ తోనూ భారతజట్టు తలపడాల్సి ఉంది. న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లతో స్వదేశంలోనే భారత్ ఢీ కోనుంది.

First Published:  20 Jan 2020 12:31 AM GMT
Next Story