Telugu Global
NEWS

కేసీఆర్ ను వెంటాడుతున్న ‘హిందుత్వ’ భయం

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించారు. ఎన్నో సమస్యలకు చాకచక్యంగా పరిష్కారం చూపించి సత్తా చాటారు. కానీ ప్రస్తుతం హిందుత్వ ఎజెండాకు మాత్రం భయపడుతున్నట్టు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక వింత సమస్యను ఎదుర్కొంటోందట.. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, నిజామాబాద్, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, కరీంనగర్, నల్గొండ , మిర్యాలగూడ తదితర పట్టణాల్లో గణనీయమైన సంఖ్యలో ప్రభావితం చేసే స్థాయిలో […]

కేసీఆర్ ను వెంటాడుతున్న ‘హిందుత్వ’ భయం
X

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించారు. ఎన్నో సమస్యలకు చాకచక్యంగా పరిష్కారం చూపించి సత్తా చాటారు. కానీ ప్రస్తుతం హిందుత్వ ఎజెండాకు మాత్రం భయపడుతున్నట్టు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక వింత సమస్యను ఎదుర్కొంటోందట.. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, నిజామాబాద్, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, కరీంనగర్, నల్గొండ , మిర్యాలగూడ తదితర పట్టణాల్లో గణనీయమైన సంఖ్యలో ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంఐఎం ఈ ఓట్లను చీల్చడానికి రెడీగా ఉంది. అయితే ఎంఐఎంతో తెరవెనుక పొత్తుతో కేసీఆర్ ముందుకెళుతుండడంతో ధీమాగా ఉన్నారు.

అయితే ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ చేయడం హిందుత్వాన్ని దూరం చేస్తుందనే భయం గులాబీ పార్టీని వెంటాడుతోంది. అది ఓటింగ్ పై ప్రభావం చూపుతుందనే భయం నెలకొంది. భైంసాలో హిందూముస్లిం గొడవ విషయంలో విస్తృతంగా సోషల్ మీడియాలో వార్తలు చెలరేగాయి. మీడియాలో నియంత్రణ వచ్చినా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగిందట.. భైంసాలో గొడవను బీజేపీ క్యాష్ చేసుకోగా.. హిందూ ఓటర్లు టీఆర్ఎస్ కు దూరం జరిగేలా చేయడంలో బీజేపీ వినియోగించుకుందన్న చర్చ సాగుతోంది.

టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఎటువంటి పొత్తు లేదని ప్రజలకు గుర్తు చేసేందుకు కేసీఆర్, నేతలు తపనపడుతున్నా బీజేపీ మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోందట..ఇటీవలే మంత్రి తలసాని కూడా ఎంఐఎంతో టీఆర్ఎస్ కు ఎలాంటి పొత్తు లేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే ఎంఐఎం అధినేతతో కేసీఆర్ ఇటీవల భేటీ కావడాన్ని బీజేపీ హైలైట్ చేస్తోంది. సీఎం స్థాయిలో అసదుద్దీన్ కు ప్రగతి భవన్ లో గౌరవం దక్కింది. అసద్ కు వీఐపీ సీటును ఇచ్చి హోంమంత్రి మహమూద్ కు మామూలు ఉడెన్ కుర్చీలో కూర్చుండబెట్టారని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఇలాంటి ప్రచారం కేసీఆర్ కు హిందుత్వ ఓటర్లను దూరం చేయడమేనన్న టెన్షన్ గులాబీ పార్టీని కలవరపెడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు హిందుత్వ ఓటు మైనస్ గా మారుతుందన్న భయంతో గులాబీ దళపతి ఆందోళనగా ఉన్నారట.

First Published:  20 Jan 2020 5:54 AM GMT
Next Story