టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై చెప్పబోతుందా?

రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? టీడీపీనీ వీడడానికి రెడీ అయ్యారా? తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ, నిరసన కార్యక్రమాల్లో పరిటాల సునీత, ఆమె కుమారుడు లేకపోవడం, రాప్తాడులోనూ టీడీపీ సందడి లేకపోవడంతో ఆమె టీడీపీని వీడడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు అమరావతి పరిరక్షణ ర్యాలీల్లో పరిటాల సునీత పాల్గొనకపోవడానికి అనారోగ్యం కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎందుకు సమావేశానికి దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పరిటాల ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ప్రజల్లోకి కూడా వెళ్లడం లేదు. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తోంది.

అయితే పరిటాల సునీత, శ్రీరామ్ లు బీజేపీతో టచ్ లో ఉన్నారని.. ఆ పార్టీలో చేరడానికి షరతులు, నిబంధనలు పెట్టారని.. వాటి గురించే అధిష్టానంతో చర్చిస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా పరిటాల శ్రీరామ్ కు బాధ్యతలు ఇచ్చారు. సునీతకు రాప్తాడు నియోజకవర్గం ఉంది. చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినా తల్లీకొడుకులు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.