సరిలేరు 2 మిలియన్ డాలర్ క్లబ్

అల వైకుంఠపురములో సినిమా కంటే ముందుగా విడుదలైనప్పటికీ, లేటుగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది సరిలేరు నీకెవ్వరు సినిమా. బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఆల్రెడీ 2 మిలియన్ క్లబ్ లోకి చేరిపోగా.. తాజాగా మహేష్ మూవీ ఈ క్లబ్ లోకి ఎంటరైంది.

ఓవర్సీస్ లో మహేష్ మూవీ కంటే బన్నీ సినిమానే బాగా ఆడుతోంది. అంతేకాదు.. 2.5 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా మహేష్ మూవీ కంటే బన్నీ సినిమానే తొందరగా చేరిపోనుంది. ఫైనల్ రన్ లో సరిలేరు నీకెవ్వరు కంటే అల వైకుంఠపురములో సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ చెబుతోంది.

అయితే మహేష్ మూవీ కంటే తక్కువగా వసూళ్లు వస్తున్నప్పటికీ.. మహేష్ మూవీ ఫ్లాప్ కాదు. ఈ సినిమా కూడా ఓవర్సీస్ లో హిట్ అయింది. అంతేకాదు.. ఇలా 2 మిలియన్ డాలర్ క్లబ్ లో వరుసగా మూడో సారి స్థానం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాడు మహేష్. ఇంతకుముందు మహేష్ నటించిన మహర్షి, భరత్ అనే నేను సినిమాలు 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి.