జూనియర్ ప్రపంచకప్ లో భారత్ బోణీ

  • శ్రీలంకపై 90 పరుగుల విజయం

2020 జూనియర్ (అండర్ -19) ప్రపంచకప్ గ్రూప్ -ఏ లీగ్ పోటీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 90 పరుగుల విజయంతో శుభారంభం చేసింది.

బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా జరిగిన గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో హాట్ ఫేవరెట్ భారత్ 90 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్లు యశస్వీ జైస్వాల్- కెప్టెన్ ప్రియం గర్గ్..  స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

యశస్వి 59, గర్గ్ 56, వైస్ కెప్టెన్ ధృవ్ జురెల్ 52, సిద్దేశ్ వీర్ 44 పరుగులు సాధించారు. సమాధానంగా 298 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్ 2 వికెట్లు, ఆకాశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. గ్రూప్- ఏ రెండోరౌండ్లో ప్రస్తుత చాంపియన్ భారతజట్టు….పసికూన జపాన్ తో తలపడాల్సి ఉంది.

మొత్తం 16 జట్లు …నాలుగు గ్రూపులుగా తలపడుతున్న ఈటోర్నీలో ..ఒక్కో గ్రూపులో అత్యధిక విజయాలు సాధించిన మొదటి రెండుజట్లు క్వార్టర్ ఫైనల్స్ లీగ్ లో ఢీ కొంటాయి.