3 మిలియన్ క్లబ్ లో చేరిన బన్నీ మూవీ

ఓవర్సీస్ లో బన్నీ వీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అతడి 20 సినిమాల కెరీర్ లో రేసుగుర్రం తప్ప మరే సినిమాకు యూఎస్ లో భారీ వసూళ్లు రాలేదు. రేసుగుర్రం తర్వాతొచ్చిన ఎన్నో సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో.. టాప్-10 లిస్ట్ లో స్థానం కోల్పోయాడు బన్నీ. అలా చాన్నాళ్లుగా ఓవర్సీస్ మార్కెట్ కు దూరమైన బన్నీని తిరిగి దగ్గర చేసింది అల వైకుంఠపురములో సినిమా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండో రోజుకే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ఈ సినిమా తాజాగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. విడుదలైన 9 రోజుల్లోనే 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది.

ఈ సినిమాతో ఇప్పటికే మహానటి, సైరా, శ్రీమంతుడు, గీతగోవిందం ఆల్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసిన బన్నీ.. ఇప్పుడు సాహోపై కన్నేశాడు. మరో 23వేల డాలర్లు ఆర్జిస్తే.. సాహోను కూడా క్రాస్ చేసి లిస్ట్ లో 5వ స్థానానికి ఎగబాకుతాడు.

ఓవర్సీస్ ఆల్ టైమ్ హిట్ మూవీస్

1. బాహుబలి 2 – $ 20 మిలియన్
2. బాహుబలి 1 – $ 6.99 మిలియన్
3. రంగస్థలం – $ 3.51 మిలియన్
4. భరత్ అనే నేను – $ 3.41 మిలియన్
5. సాహో – $ 3.23 మిలియన్
6. అల వైకుంఠపురములో – $ 2.9 మిలియన్
7. శ్రీమంతుడు – $ 2.89 మిలియన్
8. సైరా – $ 2.6 మిలియన్
9. మహానటి – $ 2.54 మిలియన్
10. గీతగోవిందం – $ 2.46 మిలియన్