Telugu Global
National

చంద్రబాబు అరెస్ట్... ఎంపీ గల్లాకు జైలు

మూడురాజధానుల కథ సుఖాంతం అయ్యింది. అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఆమోదించడం జరిగిపోయింది. అయితే అర్ధరాత్రి వేళ చంద్రబాబు హల్ చల్ చేశారు. అసెంబ్లీలో చేతులెత్తి రాజధానిని మార్చవద్దని కోరిన చంద్రబాబు… రాత్రి అయ్యాక మాత్రం మళ్లీ ఏం గుర్తుకొచ్చిందో కానీ నిరసనలకు దిగారు. మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా అసెంబ్లీ ముగిసిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు.అయితే పోలీసులు సర్ధి చెప్పి చంద్రబాబును పంపించివేశారు. అయితే అర్ధరాత్రి బాబుకు ఏం గుర్తుకు వచ్చిందో.. […]

చంద్రబాబు అరెస్ట్... ఎంపీ గల్లాకు జైలు
X

మూడురాజధానుల కథ సుఖాంతం అయ్యింది. అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఆమోదించడం జరిగిపోయింది. అయితే అర్ధరాత్రి వేళ చంద్రబాబు హల్ చల్ చేశారు. అసెంబ్లీలో చేతులెత్తి రాజధానిని మార్చవద్దని కోరిన చంద్రబాబు… రాత్రి అయ్యాక మాత్రం మళ్లీ ఏం గుర్తుకొచ్చిందో కానీ నిరసనలకు దిగారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా అసెంబ్లీ ముగిసిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు.అయితే పోలీసులు సర్ధి చెప్పి చంద్రబాబును పంపించివేశారు.

అయితే అర్ధరాత్రి బాబుకు ఏం గుర్తుకు వచ్చిందో.. ఎవరు ప్రేరేపించారో కానీ మళ్లీ మందడం వైపు పాదయాత్రగా బయటకు వచ్చారు. ఈ సమయంలోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

దీంతో పోలీసులు టీడీపీ నేతలందరినీ వ్యానులో తీసుకెళ్లారు. అయితే వ్యానుకు అడ్డంగా పడుకొని చంద్రబాబు వాహనం పోనీయలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

ఇక అంతకుముందు రాజధాని రైతులతో కలిసి వారిని రెచ్చగొడుతూ అమరావతిలో ఆందోళన చేసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నిషేదాజ్ఞాలు ఉల్లంఘించినందుకు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

పోలీసులతో వాదులాటలో చొక్కా చిరిగిపోవడం.. పోలీసులతో దురుసు ప్రవర్తన కింద గల్లాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచగా ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో ఎంపీ గల్లా జయదేవ్ ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఇది సంచలనంగా మారింది. టీడీపీ ఎంపీని జైలుకు పంపిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  21 Jan 2020 1:18 AM GMT
Next Story