పవన్… షూటింగ్ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తర్వాత ఇక సినిమాలు వదిలేశానని.. మొత్తం రాజకీయం అని బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు 2019 అసెంబ్లీ ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. రెండు చోట్ల పోటీచేసి కూడా ఓడిపోయిన దుస్థితిని మనం చూశాం. ఇక లాభం లేదనుకుని మళ్ళీ సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. సోమవారం తిరిగి సినిమా షూటింగ్ కు హాజరయ్యారు.

అయితే ఈ నేపథ్యంలో జగన్ 3 రాజధానుల బిల్లును ఆమోదించడంతో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. మధ్యాహ్నం వరకూ హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్.. అనంతరం సాయంత్రం మంగళగిరికి వచ్చి అర్ధరాత్రి వరకూ పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు.

ఇలా జగన్ పెట్టిన 3 రాజధానుల బిల్లుతో పవన్ కు సినిమాలో ప్రశాంతంగా పాల్గొనే అవకాశమే రావడం లేదు. ఆగమాగంగా.. అలిసిసొలిసి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తో పాటు రాజకీయాన్ని నెట్టుకొస్తున్నారట.. మరో మూడు నెలల పాటు డేట్స్ ఇచ్చిన పవన్ ఇలా సినిమాలు, రాజకీయం ఎంత కాలం చేస్తాడన్నది కోట్లు పెట్టుబడి పెట్టిన చిత్ర నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోందట.