నన్ను రేప్ చేశారు… రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ గా రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లోకి రంగప్రవేశం చేశారు. విచిత్రమైన తెలంగాణ యాస, భాష, నేచురల్ యాక్టింగ్ తో రాహుల్ రామకృష్ణ వరుసగా సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు.

తాజాగా ‘అల వైకుంఠపురం’లో అల్లు అర్జున్ కు ఉద్యోగం ఇచ్చే హెచ్.ఆర్ సపోర్టివ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. అయితే తెరపై నవ్వులు పూయించే రాహుల్ రామకృష్ణ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని తెలిసింది. తాజాగా ఆయన ట్విట్టల్ లో ఓ చేదు నిజాన్ని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశాడు.

తనను చిన్నప్పుడు రేప్ చేశారని.. ఆ బాధని ఎవరితో ఎక్కడ పంచుకోవాలో తెలియక తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశానని రాహుల్ రామకృష్ణ తెలిపారు. ఇలా ఇతరులతో పంచుకోవడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలిగానని.. ప్రతీది బాధగానే ఉంటుందని రాహుల్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో జోష్ గా ఉండే కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇలా ట్విట్టర్ సాక్షిగా తనను రేప్ చేశారని తెలుపడంతో అభిమానులంతా షాక్ తిన్నారు. టాలీవుడ్ లోనూ ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.