ఆర్ఆర్ఆర్ వాయిదా

అనుకున్నదే జరిగింది. అనుమానాలే నిజమయ్యాయి. ఆర్ఆర్ఆర్ వాయిదాపడింది. ఇంతకుముందు చెప్పినట్టు ఇది జులై 31కు రావడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ సినిమా వస్తుంది.

తాజాగా జరిగిన రెండు పరిణామాలు ఆర్ఆర్ఆర్ వాయిదాను సూచించాయి. వీటిలో ఒకటి తరణ్ ఆదర్శ్ ట్వీట్. సౌత్ కు చెందిన ఓ పెద్ద సినిమా వాయిదా పడబోతోందంటూ తరణ్ ట్వీట్ చేశాడు. అది ఆర్ఆర్ఆర్ అనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. ఇక రెండో అంశం అలియాభట్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిన అలియాభట్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ విషయాన్ని రామ్ చరణ్ బయటపెట్టాడు. ఇప్పటివరకు అలియా సెట్స్ పైకి రాలేదని క్లారిటీ ఇచ్చాడు.

వీటికి తోడు ఆదిలోనే పూణె షెడ్యూల్ లో రామ్ చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్నుంచి ఈ సినిమా షెడ్యూల్స్ ఆలస్యమౌతూనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును లేట్ అయ్యేలా చేశాయి. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ మేటర్ ను అధికారికంగా ప్రకటించలేదు.