Telugu Global
NEWS

టీడీపీకి వ‌రుస పెట్టి ఎమ్మెల్సీల‌ షాక్ !

పరిపాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లు అసెంబ్లీ దాటి మండ‌లికి చేరింది. అక్క‌డ బిల్లును అడ్డుకోవాల‌ని టీడీపీ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  అయితే టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి, వికేంద్రీక‌ర‌ణ బిల్లుపై మండ‌లిలో చర్చ ప్రారంభం కాకముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌రప్ర‌సాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత రూల్ 71పై చ‌ర్చ‌కు టీడీపీ ప‌ట్టుబట్టింది. ప‌లు మార్లు వాయిదా త‌ర్వాత చ‌ర్చ చేప‌ట్టే స‌మ‌యానికి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు పార్టీకి […]

టీడీపీకి వ‌రుస పెట్టి ఎమ్మెల్సీల‌ షాక్ !
X

పరిపాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లు అసెంబ్లీ దాటి మండ‌లికి చేరింది. అక్క‌డ బిల్లును అడ్డుకోవాల‌ని టీడీపీ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి,

వికేంద్రీక‌ర‌ణ బిల్లుపై మండ‌లిలో చర్చ ప్రారంభం కాకముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వ‌రప్ర‌సాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత రూల్ 71పై చ‌ర్చ‌కు టీడీపీ ప‌ట్టుబట్టింది. ప‌లు మార్లు వాయిదా త‌ర్వాత చ‌ర్చ చేప‌ట్టే స‌మ‌యానికి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం జ‌రిగారు.

చిదిపిరాళ్ళ శివనాథ్ రెడ్డి పార్టీ విప్ ధిక్క‌రించారు. ఈయ‌న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సొంత బంధువు. ఇక తుల సునీత. పరిటాల ఫ్యామిలి కి అత్యంత సన్నిహితురాలైన కుటుంబం కూడా టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

వీరే కాదు బుధ‌వారం దీపక్ రెడ్డి, అశోక్ బాబు, బీదా రవిచంద్ర, మంతెన, ద్వారపురెడ్డి , అంగర, పప్పుల, వాకాటి నారాయ‌ణ‌రెడ్డి, రాజా నరసింహులు, కేఈ ప్ర‌భాక‌ర్‌, దువ్వరపు, తిరుమలనాయుడు కూడా టీడీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం

మొత్తానికి మండలి స‌మావేశం ముగిసేలోపు 15 మంది ఎమ్మెల్సీలు టీడీపీకి గుడ్ బై చెబుతార‌ని తెలుస్తోంది. దీంతో మండ‌లిలో టీడీపీ బ‌లం స‌గానికి ప‌డిపోతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు మాత్ర‌మే ఉన్నారు.

ఎమ్మెల్సీలు ఒక్కొక్క‌రిగా జారుకోవ‌డంతో రాత్రి చంద్ర‌బాబు బ్యాచ్ ఓ ఫోటో రిలీజ్ చేసింది. అంద‌రూ ఎమ్మెల్సీలు త‌న ద‌గ్గ‌రే ఉన్నార‌ని…స‌మ‌స్య‌లేద‌ని క‌లరింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి ఇవాళ శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ కీల‌కంగా మారింది.

First Published:  21 Jan 2020 9:07 PM GMT
Next Story