మళ్ళీ తప్పులో కాలేసిన లోకేష్‌

వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంలో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు లోకేష్‌ జోక్యం చేసుకుంటూ నవరత్నాల అమలుకోసం ఆలయాలు, చర్చిలు, మసీదుల విలువైన భూములను విక్రయించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రభుత్వాన్ని విమర్శించాడు.

దీనికి ప్రతిస్పందించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి శాసనమండలిలో కూడా లోకేష్‌ అబద్ధాలు చెబుతున్నాడని, ప్రభుత్వం అలాంటి జీవోని ఏదీ ఇవ్వలేదని…. లోకేష్‌ ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భంగా ఆ జీవో కాపీలు చూపాలని లేదా కనీసం ఆ జీవో నెంబర్‌ అయినా చెప్పాలని, ఊరికే ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు.
ఆయన చేసిన ఆరోపణ నిజం కాదు కాబట్టి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.