Telugu Global
NEWS

మండలిలో టీడీపీకి షాక్.... వైసీపీకి ఐదుగురు సపోర్టు

శాసనసభలో ఏపీకి 3 రాజధానుల బిల్లును అడ్డుకోలేకపోయిన టీడీపీ మండలిలో మాత్రం గట్టిగా పోరాడుతోంది. అయితే ప్రతిగా వైసీపీ… టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకుంటున్న వైనం టీడీపీని గుబులు పుట్టిస్తోంది. తాజాగా వైసీపీకి మద్దతుగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు ముందుకువచ్చారు. అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా రాజధానుల బిల్లుకు మద్దతు ఇవ్వగా.. మరో ముగ్గురు ఇన్ డైరెక్టుగా టీడీపీకి షాకిచ్చారు. మొత్తం ఐదుగురు వైసీపీకి మద్దతుగా నిలవడం టీడీపీకి షాక్ కు […]

మండలిలో టీడీపీకి షాక్.... వైసీపీకి ఐదుగురు సపోర్టు
X

శాసనసభలో ఏపీకి 3 రాజధానుల బిల్లును అడ్డుకోలేకపోయిన టీడీపీ మండలిలో మాత్రం గట్టిగా పోరాడుతోంది. అయితే ప్రతిగా వైసీపీ… టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకుంటున్న వైనం టీడీపీని గుబులు పుట్టిస్తోంది.

తాజాగా వైసీపీకి మద్దతుగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు ముందుకువచ్చారు. అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా రాజధానుల బిల్లుకు మద్దతు ఇవ్వగా.. మరో ముగ్గురు ఇన్ డైరెక్టుగా టీడీపీకి షాకిచ్చారు. మొత్తం ఐదుగురు వైసీపీకి మద్దతుగా నిలవడం టీడీపీకి షాక్ కు గురిచేసింది.

ఏపీకి 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇక శమంతకమణి, శత్రుచర్ల విజయరామరాజు మండలి భేటికి దూరంగా ఉన్నారు. సభకు హాజరైన శివానందరెడ్డి , పోతుల సునీత మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లుకు అనుకూలంగా టీడీపీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం.

ప్రస్తుతానికైతే… టీడీపీకి మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జలక్ ఇచ్చారు. ముందు ముందు టీడీపీ లో ఎందరు మిగులుతారనే టెన్షన్ ఆ పార్టీని పట్టి పీడిస్తోంది.

First Published:  22 Jan 2020 9:28 AM GMT
Next Story