ఊహించని ట్విస్ట్‌… కాసేపట్లో పెళ్లి… ఇంతలో…?

వారంలో పెళ్లి… వరుడు..వధువు తరపు ఇళ్లల్లో పెళ్లి హడావుడి జరుగుతోంది. కానీ ఊహించని ట్విస్ట్ ఆ రెండు కుటుంబాలను కుదిపేసింది. ఇంతలో పరార్ అన్న వార్త వినిపించింది. కానీ పరారైందెవరో తెలుసా…పెళ్లి కొడుకు కాదు..పెళ్లి కూతురు కాదు…వరుడి తండ్రితో వధువు తల్లి లేచిపోయింది. ఇదేం విడ్డూరమా అనుకుంటున్నారు కదూ….కాని ఇది వాస్తవం. సూరత్‌లో జరిగిన నిజం…

అజయ్‌దేవ్‌గణ్ హిట్ మూవీ గోల్‌మాల్ సిరీస్‌లోని సినిమాను తలపించే సీన్‌..ఇక్కడ జరిగింది. కాకుంటే సినిమాలో పిల్లలే తల్లిదండ్రుల పెళ్లిళ్లు చేస్తారు. కానీ ఇది వాస్తవం కదా…అలా జరగలేదు. పెద్దలే పిల్లల పెళ్లిళ్లు చెడగొట్టి లేచిపోయారు. అసలు విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి తాము వయస్సులో ఉండగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారట. కానీ ఇద్దరి ప్రేమ ఫలించలేదు. దీంతో వధువు తల్లి మరొకర్ని పెళ్లి చేసుకుని నవసర్‌ అనే ఊరిలో నివాసముంటోంది. ఇక వధువు తండ్రి వ్యాపారంలో బాగానే సంపాదించి బాగానే స్థిరపడ్డారు.

కాలం గడిచింది. ఇద్దరికి పిల్లలు పుట్టారు. వారిద్దరూ పెళ్లీడుకొచ్చారు. తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో ఇద్దరూ 25 ఏళ్ల తర్వాత తారసపడ్డారు. పాత ప్రేమ మళ్లీ చిగురించింది. అప్పటి జ్ఞాపకాలు వాళ్లను తొలిచేశాయి.

వరుడు తండ్రి…వధువు తల్లి
మళ్లీ ప్రేమలో పడ్డారు. ఎలాగైనా లేచిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇవేమీ తెలియని ఆ వధూవరులిద్దరూ తమ కొత్త పెళ్లి బంధంపై కలలు కంటున్నారు. కొత్త జీవితం కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి వారంలో ఉందనగా ఇలా తమ తల్లిదండ్రులు ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో…ఇద్దరూ షాక్‌లోకి వెళ్లిపోయారు.

ఇప్పటి వరకు వారిద్దరు జాడ కనిపించకపోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. విషయం అక్కడాఇక్కడా తెలియడంతో ఆ రెండు కుటుంబాలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నాయి. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి వారిద్దరి కోసం గాలిస్తున్నారు.