కేసీఆర్‌కు జ్వ‌రం….

తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. రెండు రోజులుగా ఆయ‌నకు జ్వ‌రం ఉంది. దీంతో ఆయ‌న‌కు హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆస్పత్రిలోని ప్రత్యేక వైద్యుల బృందం సీఎంకు ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. జ్వ‌రంతో పాటు ద‌గ్గు ఉండ‌డంతో ఆయ‌న ఆసుప‌త్రికి వ‌చ్చారు,

రాత్రి 8గంట‌ల 45 నిమిషంలో ఆసుప‌త్రికి సీఎం కేసీఆర్ వ‌చ్చారు. ఆయ‌న‌కు వైద్యులు గంట‌న్న‌ర పాటు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఎమ‌ర్జెన్సీ రిపోర్టులు ప‌రిశీలించిన డాక్ట‌ర్లు సాధార‌ణ జ్వ‌రంగా తేల్చారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

టెస్టుల త‌ర్వాత‌ తిరిగి ప్రగతి భవన్ కి వెళ్లిపోయారు కేసీఆర్‌. సీఎంతో పాటు సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్ష్, మంత్రి తలసాని శ్రీనివాస్, శేరి సుభాష్‌ రెడ్డి ఆసుప‌త్రికి వ‌చ్చారు.అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసిన యశోద వైద్య బృందం..పూర్తి స్థాయి రిపోర్టులు వ‌చ్చిన త‌ర్వాత వివ‌రాలు చెప్ప‌నున్నారు.

ఈనెల 13వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలుసుకున్నారు. ఆ భేటీ తర్వాత సంక్రాంతి పండుగ కోసం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లిపోయారు. అయితే, అక్కడ రెండు రోజుల నుంచి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్ వచ్చారు. దీంతో రాత్రి ఆసుప‌త్రికి వచ్చిన‌ట్లు స‌మాచారం.