కీర్తిసురేష్ స్థానంలో ప్రియమణి

కీర్తిసురేష్ బాలీవుడ్ సినిమాకు సెలక్ట్ అయిందనేది పాత వార్త. ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి ఆమెను తప్పించారనేది లేటెస్ట్ న్యూస్. అవును.. ప్రతిష్టాత్మక హిందీ ప్రాజెక్టు నుంచి కీర్తిసురేష్ ను తప్పించారు. అజయ్ దేవగన్ సరసన ‘మైదాన్’ సినిమాలో ఫిక్సయింది కీర్తి సురేష్. 1950 బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జస్ట్ గ్లామరస్ హీరోయిన్ గానే కాదు, తల్లిగా కూడా నటించాల్సి ఉంది.

కీర్తిసురేష్ మంచి నటి కాబట్టి ఆమెను ఫిక్స్ చేశారు. పైగా సౌత్ హీరోయిన్లను అజయ్ దేవగన్ బాగా ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి కీర్తి ఎంట్రీ కూడా ఈజీగా జరిగిపోయింది. మేకర్స్ కీర్తిని ఈ సినిమా హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నప్పటికీ అంతా బానే ఉంది. కానీ ఈమధ్య కీర్తిసురేష్ సడెన్ గా బరువు తగ్గింది. ఇదే ఆమెకు బాలీవుడ్ ఆఫర్ దూరం చేసింది.

మైదాన్ కథకు కాస్త బొద్దుగా కనిపించాలి. మరీ ముఖ్యంగా ఇది తల్లి పాత్ర కాబట్టి ఆ లుక్స్ అవసరం. కానీ కీర్తి మాత్రం సన్నగా మారిపోయింది. దీంతో చేసేదేం లేక ఆమెను తప్పించి, ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు.