మళ్లీ విదేశాలకు మహేష్….

ఖాళీ సమయాల్లో ఎవరైనా సినిమాలు చూస్తారు, పుస్తకాలు చదువుకుంటారు, క్రికెట్ ఆడతారు, లేదంటే నిద్రపోతారు. కానీ మహేష్ బాబు మాత్రం విదేశాలకు వెళ్లిపోతాడు. అవును.. అటుఇటుగా 4 రోజులు గ్యాప్ దొరికినా చాలు, ఏదో ఒక దేశం చుట్టేస్తుంటాడు ఈహీరో. అలాంటిది ఈసారి ఏకంగా 2 నెలలు గ్యాప్ దొరికేసింది. ఇక ఊరుకుంటాడా? మరోసారి సూట్ కేస్ సర్దేశాడు. ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లిపోయాడు.

ఈరోజు నమ్రత పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకు న్యూయార్క్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు మహేష్. అక్కడ్నుంచే ఓ ఫొటో వదిలాడు. ఫ్యామిలీతో ఎంజాయ్ మెంట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టేశాడు. మహేష్ ఎన్నాళ్లు ఈ టూర్ వేశాడనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే న్యూయార్క్ తో ఆగడు. అట్నుంచి అటు మరో దేశం వెళ్తాడు, ఇంకొన్ని ప్రదేశాలు చుట్టేస్తుంటాడు. మహేష్ కు ట్రావెలింగ్ అంటే అంతిష్టం మరి.

ఈ 2 నెలల్లో కనీసం 3 టూర్లు ప్లాన్ చేశాడు మహేష్ బాబు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు ఈ హీరో. 2 నెలల గ్యాప్ తర్వాత ఆ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ గ్యాప్ లో మరో సినిమా కూడా ఎనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నాడు మహేష్.