గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఓడినా డబ్బే డబ్బు

  • తొలిరౌండ్లో ఓడినా భారీగా నష్టపరిహారం

క్రీడల్లో విజేతలుగా నిలిచినవారికి మాత్రమే భారీగా ప్రైజ్ మనీ ఇవ్వడం మనకు తెలుసు. అయితే…గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో…ప్రధానంగా నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో తొలిరౌండ్లో పరాజయం పాలైన క్రీడాకారులకు సైతం భారీగానే గ్యారెంటీ మనీ రూపంలో ప్ర్రైజ్ మనీ ముట్టజెబుతున్నారు.

2020 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్లో పరాజయం పొందిన మొత్తం 128 మంది ప్లేయర్లకు 90వేల ఆస్ట్ర్రేలియన్ డాలర్లు చొప్పున నష్టపరిహారంగా చెల్లించారు. ఇది అమెరికన్ డాలర్లలో 61 వేల 666 గా ఉంది. ఈ మొత్తం ఓ సగటు ఆస్ట్ర్రేలియన్ ఉద్యోగి ఏడాది కాలానికి ఆర్జించే మొత్తానికి సమానం కావడం విశేషం.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లోనే పరాజయం పొందిన భారత డేవిస్ కప్ ప్లేయర్ ప్రజ్ఞేశ్, రష్యన్ స్టార్ మారియా షరపోవా, స్వీడిష్ ప్లేయర్ జోహానా లార్సన్ తో సహా…మొత్తం 128 మంది పరాజితులకు 45 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించారు.

అదే ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ పరాజితులకు 51 వేల 28 డాలర్లు, వింబుల్డన్ లో 58 వేల 514 డాలర్లు, యూఎస్ ఓపెన్లో 58వేల డాలర్లు చొప్పున చెల్లిస్తున్నారు.

గత ఏడాదితో పోల్చిచూస్తే… ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్ పరాజితులకు చెల్లించే మొత్తాన్ని 12 శాతానికి పెంచినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.