ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మూడోరౌండ్లో ఫెదరర్

  • మిక్సిడ్ డబుల్స్ కు సానియా దూరం

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగకముందే మహిళలభారత డబుల్స్ స్టార్ సానియా మీర్జా..మిక్సిడ్ డబుల్స్ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

కుడికాలి నరం పట్టేయడంతో మిక్సిడ్ డబుల్స్ నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది. రోహన్ బొపన్నతో జంటగా మిక్సిడ్ బరిలోకి సానియా దిగాల్సి ఉంది.

అయితే…మహిళల డబుల్స్ లో మాత్రం నాడియాతో జంటగా తనపోటీ కొనసాగిస్తానని ప్రకటించింది. 33 సంవత్సరాల సానియా ఓ బిడ్డకుతల్లిగా ఇటీవలే 27మాసాల విరామం తర్వాత ఓ అంతర్జాయ డబుల్స్ టైటిల్ సాధించింది.

ఫెదరర్ రెండుదశాబ్దాల రికార్డు…

స్విస్ గ్రేట్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే ఆరుసార్లు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన 3వ సీడ్ ఫెదరర్ 38 సంవత్సరాల వయసులో రెండోరౌండ్ విజయం సాధించడం ద్వారా మూడోరౌండ్లో అడుగుపెట్టాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోటీలో వెటరన్ ఫెదరర్ 6-1, 6-4, 6-1తో 41వ ర్యాంకర్ సెర్బియా ప్లేయర్ ఫిలిప్పీ క్రజనోవిచ్ ను చిత్తు చేశాడు.

గత 20 సంవత్సరాలుగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో ఫెదరర్ రెండోరౌండ్ నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నాలుగోరౌండ్లో చోటు కోసం ఆస్ట్ర్రేలియా ఆటగాడు జాన్ మిల్ మాన్ తో ఫెదరర్ పోటీపడతాడు.

మూడోరౌండ్లో సెరెనా విలియమ్స్….

మహిళల సింగిల్స్ లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో ఉన్న ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్…మూడోరౌండ్ కు అర్హత సంపాదించింది.

రెండోరౌండ్లో స్లొవేనియా ప్లేయర్ తమారాను 6-3, 6-2తో సెరెనా అలవోకగా ఓడించింది. 38 ఏళ్ల సెరెనా మూడోరౌండ్లో చైనా ప్లేయర్ వాంగ్ క్వియాంగ్ తో తలపడాల్సి ఉంది.