రష్మికకు రెండు పాన్ కార్డులు…. అందుకే ఐటీ రైడ్స్ జరిగాయా?

హీరోయిన్ రష్మిక మందన్న… ఈమెకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిస్తే.. ఐటీ డిపార్ట్ మెంట్ మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అవును… రష్మికకు భారీగా లెక్కల్లోకి రాని ఆస్తులు ఉన్నాయట. సంక్రాంతి సీజన్ లో సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చిన రష్మిక…. ఆస్తులను కూడబెట్టడంలోనూ సరిలేరు నాకెవ్వరూ అంటోందట.

సంక్రాంతి సీజన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ మూడ్ లో ఉన్న ఈ భామకు….ఐటీ డిపార్ట్ మెంట్ పెద్ద షాకే ఇచ్చింది.. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని మడికేరి, వీరాజపేట, బెంగళూరు నగరంతో సహ సుమారు 10 చోట్ల రష్మిక మందన్నకు చెందిన ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు చేసింది. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేసింది. ఇదంతా రొటీన్ వ్యవహారం అనుకున్నారు. కానీ..విచారణ చేసే కొద్దీ ఈ భామ వెనుకాల ఉన్న ఆస్తులు చూసి ఐటీనే నివ్వెరపోయిందట. ఐటీ ఎగ్గొట్టేందుకు ఈ పాప పక్కా ప్లాన్ తో ఉన్న విధానం చూసి అధికారులు ఆమె ఇంట్లోనే సమన్లు జారీ చేశారట.

రష్మిక లెక్కలో చూపని ఆస్తుల చిట్టాపై ఐటీ ఆరా తీసింది. సోదాల టైమ్ లోనే లెక్కల్లో చూపలేదని… రూ.25 లక్షలు సీజ్ చేసింది. అలాగే అన్ డిక్లేర్డ్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు 4కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు కోటిన్నర వరకు ఆమె ఆదాయపన్ను బకాయి ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఆమె పేరు మీద రెండు పాన్ కార్డులు ఉన్నాయట.

సోమవారం రష్మిక మందన్న పేరెంట్స్  మైసూరులోని ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఐటీ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారని…అవి సబ్మిట్ చేసినట్లు రష్మిక తండ్రి తెలిపారు. కానీ పైకి చెప్పినంత ఈజీగా లోపల యవ్వారం జరగలేదని… చాలా ఘాటుగానే ఎంక్వైరీ జరిగినట్లు తెలుస్తోంది.

కన్నడలో కిరాక్ పార్టీ, అంజనీపుత్ర, చమక్ తదితర సినిమాల్లో రష్మిక మందన్న నటించారు. ఇక తెలుగులో గీతా గోవిందం, దేవదాస్, మిస్టర్ కామ్రేడ్, భీష్మాతో పాటు అనేక సినిమాల్లో నటించింది. రీసెంట్ గా హీరో మహేష్ తో నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా బడా హీరోల సినిమాలే. వాటిలో బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ కూడా ఉంది.