Telugu Global
NEWS

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆసియా దేశాలజట్లు

భారత్, పాక్, అప్ఘనిస్థాన్ జట్ల జోరు సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ పోటీల గ్రూప్ లీగ్ లో ఆసియా దేశాల జట్ల జోరు కొనసాగుతోంది. నాలుగుసార్లు విజేత భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, సంచలనాల అప్ఘనిస్థాన్ తమ తమ గ్రూప్ లీగ్ లో రెండేసి విజయాలు చొప్పున సాధించి క్వార్టర్ ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొన్నాయి. న్యూజిలాండ్ సైతం క్వార్టర్స్ చేరుకోగా శ్రీలంక వరుసపరాజయాలతో విఫలమయ్యింది. బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ […]

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆసియా దేశాలజట్లు
X
  • భారత్, పాక్, అప్ఘనిస్థాన్ జట్ల జోరు

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ పోటీల గ్రూప్ లీగ్ లో ఆసియా దేశాల జట్ల జోరు కొనసాగుతోంది. నాలుగుసార్లు విజేత భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, సంచలనాల అప్ఘనిస్థాన్ తమ తమ గ్రూప్ లీగ్ లో రెండేసి విజయాలు చొప్పున సాధించి క్వార్టర్ ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొన్నాయి.

న్యూజిలాండ్ సైతం క్వార్టర్స్ చేరుకోగా శ్రీలంక వరుసపరాజయాలతో విఫలమయ్యింది. బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ గ్రూప్-ఏ లీగ్ లో శ్రీలంకను 90 పరుగులు, జపాన్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేయడం ద్వారా హాట్ ఫేవరెట్ బారత్ అగ్రస్థానంలో నిలవడం ద్వారా క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకోగలిగింది.

శ్రీలంక రెండో ఓటమి..

గ్రూపు-ఏలీగ్ మరో రెండోరౌండ్ పోటీలో శ్రీలంకపై ఆఖరి ఓవర్ విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ సైతం క్వార్టర్ ఫైనల్స్ చేరింది. శ్రీలంక 9 వికెట్లకు 242 పరుగుల స్కోరు సాధించగా…న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.

మరో గ్రూపు లీగ్ పోటీలో అప్ఘనిస్థాన్ 160 పరుగుల భారీతేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను చిత్తు చేసి…క్వార్టర్ పైనల్స్ లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘన్ జట్టు 265 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఇబ్రహీం జడ్రాన్ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సమాధానంగా 266 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఎమిరేట్స్ జట్టు 105 పరుగులకే కుప్పకూలింది. లెగ్ స్పిన్నర్ షఫీయుల్లా గఫారీ 5 వికెట్లు పడగొట్టాడు.

పోరాడి ఓడిన జింబాబ్వే…

పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా జరిగిన మరో గ్రూప్ పోటీలో మాజీ చాంపియన్ పాకిస్తాన్ 38 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయంతో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు 9 వికెట్లకు 294 పరుగులు సాధించింది. మహ్మద్ హారిస్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సమాధానంగా జింబాబ్వే 256 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గత ప్రపంచకప్ రన్నరప్ ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాజట్లు సైతం క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ల కోసం ఎదురుచూస్తున్నాయి.

First Published:  22 Jan 2020 11:51 PM GMT
Next Story