మాఫియా డాన్ గా మహేష్

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు మహేష్. కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్లాడు. మరో 2 నెలల వరకు అతడు సినిమాలకు దూరం. అయితే మహేష్ మూవీస్ కు దూరమైనప్పటికీ, అతడి సినిమాలకు చెందిన అప్ డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి.

ఈ ప్రాజెక్టులో మాఫియా డాన్ గా కనిపిస్తాడట మహేష్. అంటే.. మరోసారి మహేష్ ను వంశీ పైడిపల్లి మోస్ట్ స్టయిలిష్ గా చూపించబోతున్నాడన్నమాట. మహర్షి సినిమాలో బిజినెస్ మేన్ గా స్టయిలిష్ గా చూపించాడు పైడిపల్లి. ఇప్పుడు మరోసారి అదే మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి జానర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది.

ఈ సినిమాలో మహేష్ నుంచి అద్భుతమైన ఫైట్స్, డాన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ సినిమాలో కనిపిస్తున్న మాఫియా బేస్డ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ మూవీ ఉంటుందంటున్నాడు. అటు డాన్స్ విషయంలో కూడా మహేష్ ను మరింత కొత్తగా చూస్తారని చెబుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై మార్చి మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.