జగన్‌ తీసుకున్నది మంచి నిర్ణయం – మాజీ కేంద్రమంత్రి

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు. ఈరోజు ఉదయం తిరుమలను దర్శించుకున్న ఆయన… అనంతరం మూడు రాజధానుల విషయంపై స్పందించారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ గా ఎంచుకోవడం మంచి నిర్ణయమని దానిని తాను స్వాగతిస్తున్నానన్నారు. రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు శివరామకృష్ణన్‌ నివేదికను తుంగలో తొక్కారని… తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధికోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కృషిచేయాలని కోరారు.