Telugu Global
National

మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు... ఆఖరి చూపులకు రండి!

నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి. ఇలా.. ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. ‘మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి’ అని ఆనవాయితీ […]

మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు... ఆఖరి చూపులకు రండి!
X

నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి.

ఇలా.. ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. ‘మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి’ అని ఆనవాయితీ ప్రకారం పిలుపు పంపారు. అంతకు ముందు.. దోషుల చివరి కోరికను అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో.. నిర్భయ కేసు దోషుల కుటుంబీకులు వారి పిల్లలను చూసుకునేందుకు జైలుకు వెళ్తారా? అసలు వారి ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు జైలులో ఉన్న ఆ నలుగురి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అన్నది.. అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఈ భావోద్వేగాల సంగతి ఎలా ఉన్నా.. ఆ నలుగురు దోషుల ఉరి తీత మాత్రం ఖాయం. ఈ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కారాగారంలో దోషులు ఎలా ఉన్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నది నిరంతరం కనిపెడుతూ ఉన్నారు.

First Published:  24 Jan 2020 4:03 AM GMT
Next Story