మహేష్ ఇలా.. బన్నీ “అలా”

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాకు సంబంధించి ఎలాంటి వసూళ్ల వివరాలు బయటపెట్టరు. ఫైనల్ రన్ ముగిసిన తర్వాత మాత్రమే క్లోజింగ్ కలెక్షన్లను బయటపెడతారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత అనీల్ సుంకర స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఇప్పుడు బన్నీ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. తన సినిమాకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఎలాంటి సక్సెస్ సెలబ్రేషన్స్ లో బన్నీ పాల్గొనడం లేదు. అయితే దీనికి కారణం వేరు.

బన్నీ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాత్తుగా కన్నుమూశారు. అల్లు అర్జున్ తల్లి నిర్మాలాదేవికి ఈయన స్వయానా పెద్దన్నయ్య. ఇన్నాళ్లూ అల వైకుంఠపురములో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకే సినిమా సక్సెస్ సంబరాలన్నీ రద్దుచేసుకున్నాడు అల్లు అర్జున్. ఇందులో భాగంగా తిరుపతిలో జరగాల్సిన సక్సెస్ మీట్ ను రద్దుచేసుకున్నాడు. దీంతోపాటు కర్ణాటక, కేరళలో నిర్వహించాల్సిన ఈవెంట్స్ కూడా రద్దయ్యాయి.

అటు ఓవర్సీస్ లో అల వైకుంఠపురములో సినిమా హవా కొనసాగుతోంది. ఇప్పటికే టాప్-10 చార్టులో చేరిన ఈ మూవీ తాజాగా తన కలెక్షన్ ను మరింత పెంచుకుంది. బుధవారం ఈ సినిమాకు 24,413 డాలర్ల వసూళ్లు వచ్చాయి. దీంతో టోటల్ గ్రాస్ 3.16 మిలియన్ డాలర్లకు చేరింది. గురువారం వసూళ్లతో ఈ సినిమా సాహోను క్రాస్ చేసి, ఐదో స్థానానికి ఎగబాకే ఛాన్స్ ఉంది.