ఓవర్సీస్ లో ఆల్ టైమ్ టాప్-5లో “అల”

సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ వసూళ్లను ఇష్టమొచ్చినట్టు మార్చేస్తుంటారు. ఇక్కడంతా వీళ్ల చేతుల్లో పని. కానీ ఓవర్సీస్ లో అలా కాదు. అక్కడ వసూళ్లన్నీ పక్కాగా ట్రాక్ చేస్తారు. కాబట్టి వాటిని నమ్మొచ్చు. సో… ఎలా చూసుకున్నా అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయిందనేది మాత్రం వాస్తవం.

కళ్లముందే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా తాజాగా ఓవర్సీస్ ఆల్ టైమ్ టాప్-5 లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ క్రమంలో శ్రీమంతుడు, సైరా, మహానటి, గీతగోవిందం లాంటి ఎన్నో సినిమాల్ని క్రాస్ చేసింది బన్నీ మూవీ. రీసెంట్ గా వచ్చిన సాహో సినిమా కూడా బన్నీ ముూవీ దెబ్బకు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి అల వైకుంఠపురములో సినిమాకు భరత్ అనే నేను సినిమా పోటీగా నిలిచింది. అది కూడా క్రాస్ చేస్తే టాప్-4కు ఎగబాకుతుంది ఈ మూవీ.

1. బాహుబలి 2 – $ 20,571,695
2. బాహుబలి 1 – $ 6,999,312
3. రంగస్థలం – $ 3,513,450
4. భరత్ అనే నేను – $ 3,416,451
5. అల వైకుంఠపురములో – $ 3,234,396