నాగార్జున సరసన దియా

ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేస్తున్నారు. నాగార్జున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపిక పూర్తిచేశారు. సినిమాలో నాగ్ సరసన దియా మిర్జా హీరోయిన్ గా నటించనుంది.

నిజానికి దియా ఇప్పుడు లైమ్ లైట్లో లేదు. అయినప్పటికీ ఆమెకు అవకాశం ఇచ్చాడు నాగార్జున. నిజానికి సీనియర్ హీరోల్లో గ్లామరస్ గా ఉండేది నాగ్ ఒక్కడే. ఇతడి సరసన రకుల్ లాంటి అమ్మాయిలు కూడా సెట్ అయిపోయారు. కావాలంటే మరో ముద్దుగుమ్మను తీసుకోవచ్చు. కానీ నాగ్ మాత్రం ఏరికోరి దియాకే ఛాన్స్ ఇచ్చాడు. కథ డిమాండ్ చేస్తోందట.

రీసెంట్ గా భర్తకు విడాకులిచ్చింది దియామీర్జా. మంచి అవకాశాలొస్తే సౌత్ లో నటించడానికి రెడీగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే దియాకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఫేడవుట్ అయిన హీరోయిన్ ను ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని పక్కనపెడితే.. నాగ్-దియాది కచ్చితంగా ఫ్రెష్ కాంబినేషన్ అనిపించుకుంటుంది. ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు నాగ్.