Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో ఫెదరర్ 100వ విజయం

మూడోరౌండ్లోనే సెరెనా, ఒసాకా ప్యాకప్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఆరుసార్లు విన్నర్, 38 ఏళ్ల వెటరన్ రోజర్ ఫెదరర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్ లో 100 విజయాల రికార్డు సాధించాడు. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన మూడోరౌండ్ సమరంలో కంగారూ ఆటగాడు జాన్ మిల్ మాన్ ను అధిగమించాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఐదుసెట్ల మారథాన్ సమరంలో ఫెదరర్ తన అనుభవానికి పోరాటపటిమను జోడించి ఆడి 4-6, 7-6, 6-4, 4-6, […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో ఫెదరర్ 100వ విజయం
X
  • మూడోరౌండ్లోనే సెరెనా, ఒసాకా ప్యాకప్

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఆరుసార్లు విన్నర్, 38 ఏళ్ల వెటరన్ రోజర్ ఫెదరర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్ లో 100 విజయాల రికార్డు సాధించాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన మూడోరౌండ్ సమరంలో కంగారూ ఆటగాడు జాన్ మిల్ మాన్ ను అధిగమించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఐదుసెట్ల మారథాన్ సమరంలో ఫెదరర్ తన అనుభవానికి పోరాటపటిమను జోడించి ఆడి 4-6, 7-6, 6-4, 4-6, 7-6తో విజేతగా నిలిచాడు. ఆఖరిసెట్ ను టై బ్రేక్ ద్వారా 10-8తో కైవసం చేసుకోడం ద్వారా ఫెదరర్ ఊపిరి పీల్చుకొన్నాడు.

క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగే సమరంలో హంగెరీ ఆటగాడు మోర్టోన్ తో ఫెదరర్ తలపడనున్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే రికార్డు స్థాయిలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ 21వ టైటిల్ కు గురిపెట్టాడు.

పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ చేరిన ఆటగాళ్లలో రెండో సీడ్ నొవాక్ జోకోవిచ్, కెనడా థండర్ మిలోస్ రావ్ నిచ్ సైతం ఉన్నారు.

మూడోరౌండ్లో సెరెనాకు షాక్…

అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ మూడోరౌండ్ ఓటమితో ఇంటిదారిపట్టింది. 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన 38 ఏళ్ల సెరెనాను చైనా ప్లేయర్ వాంగ్ కియాంగ్ మూడుసెట్ల సమరంలో కంగు తినిపించింది. 8వ సీడ్ సెరెనా పై 27వ సీడ్ వాంగ్ కు ఇదే అతిపెద్ద గెలుపు కావడం విశేషం.

మరో మూడోరౌండ్ సమరంలో…అమెరికా సంచలనం, 15 సంవత్సరాల కోకో గాఫ్ వరుస సెట్లలో డిఫెండింగ్ చాంపియన్ నవోమీ ఒసాకాపై సంచలన విజయం సాధించి నాలుగోరౌండ్లో అడుగుపెట్టింది.

First Published:  24 Jan 2020 9:02 PM GMT
Next Story