హరీష్ శంకర్-అఖిల్ సినిమా నిజమేనా?

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో ఓ సినిమా చేస్తాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తుున్నాయి. ఇందులో సగం నిజం ఉంది, ఇంకాస్త అబద్ధం కూడా ఉంది.

గద్దలకొండ గణేష్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా చేయాలి హరీష్ శంకర్. ఈ మేరకు అతడు అడ్వాన్స్ అందుకున్నాడు. వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ అంతా అనుకుంటున్నట్టు అది అఖిల్ కోసం కాదు. పవన్ కల్యాణ్ కోసం. ఆల్రెడీ పవన్ కు నెరేషన్ ఇచ్చాడు హరీష్. పవన్ కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

కాకపోతే ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా ఉంటుంది. పవన్ కు దాదాపు 3 ఏళ్ల కిందటే 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. తన అఫిడవిట్ లో కూడా పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

సో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ సినిమా చేస్తే అది కచ్చితంగా హరీశ్ శంకర్ దర్శకత్వంలోనే ఉంటుంది. కాకపోతే పవన్ సెట్స్ పైకి రావడానికి కనీసం 7-8 నెలలు పడుతుంది కాబట్టి, ఈ గ్యాప్ లో హరీష్ తో మరో మూవీ ప్లాన్ చేస్తోంది మైత్రీ. అది అఖిల్ దే కావొచ్చు.