కమెడియన్ సునీల్.. కోలుకున్నాడు.. మాట్లాడాడు

అల వైకుంఠపురంలో, డిస్కోరాజా సినిమాల్లో కీలక పాత్రలతో మళ్లీ యాక్టివ్ అయిన కమెడియన్ కమ్ హీరో సునీల్.. ఈ మధ్య తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. యాంటీ బయోటిక్స్ ను ఎక్కువ మోతాదులో తీసుకున్న కారణంగానే ఇంతటి అవస్థకు సునీల్ గురైనట్టు వార్తలు వచ్చాయి.

ఇంకొందరైతే సునీల్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందంటూ లీకులు ఇచ్చారు. చివరికి.. వాటన్నిటినీ పటా పంచలు చేస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తూ.. సునీల్ మాట్లాడాడు. కాస్త కోలుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన సందేశాన్ని పంపించాడు.

తాను బాగానే ఉన్నానని.. తన క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. తమ అభిమాన నటుడు త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని… మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.