తెలంగాణ రైతుకు ప‌ద్మ అవార్డు

రిప‌బ్లిక్ డేను పుర‌స్క‌రించుకుని ప‌ద్మ పుర‌స్కారాల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. ఈసారి ఐదుగురు తెలుగువారికి పద్మ అవార్డులు ద‌క్కాయి.

1. పీవీ సింధు ( క్రీడ‌లు )
2. చింత‌ల వెంక‌ట‌రెడ్డి ( వ్య‌వసాయం )
3. విజయసారధి శ్రీభాష్యం (సాహిత్యం, విద్య)
4. ఎడ్ల గోపాల్‌రావు ( క‌ళ‌లు )
5. దలవాయి చలపతిరావు( కళలు) విభాగంలో అవార్డులు దక్కాయి

ఈ ఏడాది మొత్తం 141 మందికి పద్మ అవార్డులను ప్ర‌క‌టించారు. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించింది. మరో 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.

తెలంగాణ నుంచి వ్య‌వ‌సాయం విభాగంలో చింత‌ల వెంక‌ట‌రెడ్డికి ప‌ద్మ అవార్డు దక్కింది. వెంక‌ట‌రెడ్డి హైద‌రాబాద్‌లో అల్వాల లో పుట్టారు. మొద‌టి నుంచి వ్య‌వ‌సాయం అంటే చాలా ఇష్టం. కాలేజీ చ‌దువులు పూర్తియిన త‌ర్వాత వ్య‌వ‌సాయంలో అడుగుపెట్టారు.

కీస‌ర ద‌గ్గ‌ర ఉన్న కుంద‌న‌ప‌ల్లిలో ఈయ‌న‌కు ద్రాక్ష తోట ఉంది. అల్వాల్‌లోని పొలంలో కొత్త‌కొత్త వంగ‌డాల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపేవారు. ద్రాక్ష సాగులో ఈయ‌న ద‌గ్గ‌ర మెళుకువ‌లు తెలుసుకునేందుకు ఇత‌ర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చేవారు.

ద్రాక్ష‌సాగులో డ్రిప్ ఇరిగేష‌న్ ప‌ద్ధతి, ఆర్గానిక్ సాగు ప‌ద్ధ‌తిల‌ను ఈయ‌న ప్ర‌వేశ‌పెట్టారు, ఆధునిక వంగ‌డాల‌ను సృష్టించారు. ప‌లు ఉత్ప‌త్తుల‌పై పేటెంట్‌లు కూడా పొందారు.

ఈయ‌న‌ 199,2001,2006లో ఉత్త‌మ రైతు పుర‌స్కారాల‌ను పొందారు. ర‌సాయ‌న ఎరువులు, మందులు వాడ‌కుండా సాగు చేసేందుకు ఈయ‌న ఇష్ట‌పడేవారు. ఓ రైతు నేస్తానికి ప‌ద్మ‌శ్రీ అవార్డు రావ‌డం ప‌ట్ల ప‌లువురు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.