Telugu Global
Cinema & Entertainment

అశ్వథ్థామ... ఇదొక రియల్ స్టోరీ

ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ. నాగశౌర్య-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు కథ రాశాడు నాగశౌర్య. అంతేకాదు.. ఈ సినిమా పేరును తన గుండెలపై పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నాడు. ఇది తన సొంత బ్యానర్ సినిమా కూడా. నాగశౌర్యకు ఈ సినిమాకు కథ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే… దీనిపై శౌర్య స్పందించాడు. తన స్నేహితుడి చెల్లెలుకు జరిగిన ఘోర అనుభవమే అశ్వథ్థామ కథ అంటున్నాడు నాగశౌర్య. ఆ ఘటన తనను కలిచివేసిందని, […]

అశ్వథ్థామ... ఇదొక రియల్ స్టోరీ
X

ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ. నాగశౌర్య-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు కథ రాశాడు నాగశౌర్య. అంతేకాదు.. ఈ సినిమా పేరును తన గుండెలపై పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నాడు. ఇది తన సొంత బ్యానర్ సినిమా కూడా. నాగశౌర్యకు ఈ సినిమాకు కథ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే… దీనిపై శౌర్య స్పందించాడు.

తన స్నేహితుడి చెల్లెలుకు జరిగిన ఘోర అనుభవమే అశ్వథ్థామ కథ అంటున్నాడు నాగశౌర్య. ఆ ఘటన తనను కలిచివేసిందని, ఆ ప్రేరణతోనే తను ఈ సినిమాకు కథ రాశానని చెబుతున్నాడు. ప్రతి మనిషికి ఈ కథ కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. మన చెల్లెలు, అక్క, తల్లి, భార్యతో మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తే.. మనకు ఎంత బాధ కలుగుతుందో.. ఆ ఫీలింగ్స్ అన్నీ అశ్వథ్థామలో చూపించామంటున్నాడు.

ఖమ్మంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇద్దరు సంగీత దర్శకులు వర్క్ చేశారు. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. శ్రీచరణ్ పాకాల పాటలు కంపోజ్ చేశాడు. నర్తనశాల లాంటి డిజాస్టర్ తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా తప్పకుండా, తన బ్యానర్ కు, తన కెరీర్ కు కలిసొస్తుందంటున్నాడు శౌర్య.

First Published:  26 Jan 2020 5:39 AM GMT
Next Story