మళ్లీ సెట్స్ పైకి పవన్ సినిమా

ఇప్పటికే పింక్ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పవన్. కానీ ఒకే ఒక్క రోజు ఇలా షూటింగ్ చేసి అలా ప్యాకప్ చెప్పాడు. రెండో రోజు నుంచి మళ్లీ రాజకీయాలతో బిజీ అయిపోయాడు. అలా ఒక్క రోజు షూటింగ్ తోనే సైడ్ అయిపోయిన ఈ సినిమాను రేపట్నుంచి మళ్లీ సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్. రేపు ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.

పవన్ కోసం దిల్ రాజు ప్రత్యేకంగా ఓ చార్టర్డ్ విమానాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. షూటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ-హైదరాబాద్ మధ్య పవన్ తిరిగేందుకు ఫ్లయిట్ ఏర్పాటు చేశాడు. పింక్ సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు పవన్ ఈ విమానంలో ప్రయాణిస్తాడు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మొదటి రోజే లీకులు మొదలయ్యాయి. స్టిల్స్ తో పాటు ఏకంగా ఫస్ట్ డే తీసిన సీన్ లీక్ అయిపోయింది. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు సినిమా యూనిట్ కు  కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై అన్నీ ఇన్-డోర్స్ లోనే షూట్ చేయాలని నిర్ణయించారు. ఔట్ డోర్ లో తీయాల్సిన సన్నివేశాల్ని కూడా సెట్స్ వేసి షూట్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాను మే చివరి వారంలో థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.