రవితేజ నుంచి 2 అప్ డేట్స్

ఈరోజు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి సంబంధించి 2 సినిమాల అప్ డేట్స్ బయటకొచ్చాయి. వీటిలో ముందుగా క్రాక్ సినిమా గురించి చెప్పుకోవాలి. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోంది ఈ సినిమా. ఆల్రెడీ సెట్స్ పైకొచ్చిన ఈ సినిమాను మే 8న విడుదల చేయబోతున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో డిజైన్ కూడా రిలీజైంది. శృతిహాసన్ లుక్ కూడా బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇక పుట్టినరోజు సందర్భంగా రవితేజ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ఈరోజు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో లాంఛ్ చేసి, మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకొస్తారు. గతంలో రవితేజ-రమేష్ వర్మ కాంబోలో వీర అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ల కాంబోలో సినిమా వస్తోంది. రీసెంట్ గా రాక్షసుడు అనే రీమేక్ సినిమా చేశాడు రమేష్ వర్మ.

ఈ పుట్టినరోజుకు రవితేజ నుంచి డిస్కోరాజా సినిమా వచ్చింది. కానీ అది ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయింది. చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. అలా డిస్కోరాజా, రవితేజకు అసలైన బర్త్ డే గిఫ్ట్ అందించలేకపోయింది.