75 ఏళ్ల వయసులో ప్రోఫెషనల్ ఫుట్ బాల్

  • ఈజిప్టు ప్లేయర్ ప్రపంచ రికార్డు..

ప్రపంచ క్రీడ ఫుట్ బాల్..మెరుపువేగంతో సాగిపోయే క్రీడ. 90 నిముషాలపాటు ఉరుకుల పరుగులతో సాగిపోయే ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆడటం అంటే.. నూనూగు మీసాలవయసున్న కుర్రాళ్లకే సవాలు లాంటిది.

అయితే…ఈజిప్టుకు చెందిన ఇజ్ ఎల్ దిన్ బహదూర్ అనే 75 సంవత్సరాల వెటరన్ సాకర్ ప్లేయర్… మాత్రం ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆడటానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాడు.

ఈజిప్టు ఫుట్ బాల్ లీగ్…మూడో డివిజన్ క్లబ్..సిక్స్త్ అక్టోబర్ జట్టు తరపునఆడటానికి కాంట్రాక్టు కుదుర్చుకోడం ద్వారా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరాడు.

ఇప్పటి వరకూ ఇజ్రాయిల్ ఆటగాడు ఇజాక్ హేయక్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును బహదూర్ తెరమరుగు చేయనున్నాడు, ఇజాక్ 73 సంవత్సరాల వయసులో.. ఇజ్రాయిల్ నాలుగో డివిజన్ సాకర్ లో పాల్గొనడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

75 సంవత్సరాల వయసులో బహదూర్ ప్రోసాకర్ లో పాల్గొనడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.75 సంవత్సరాల వయసు వరకూ ఆరోగ్యంగా బతకడమే గగనమైపోతున్న ప్రస్తుత కాలంలో…75 సంవత్సరాల వయసులో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆడటానికి సిద్దమైన దిన్ బహదూర్ ను చూసి అందరూ స్ఫూర్తి పొందక తప్పదు.