ఆ వీడియో చూడాల్సి వస్తుందని బాబు సభకు రాలేదట!

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై శాసనసభలో చర్చ మొదలైంది. ఇంత కీలకమైన సమయంలో చంద్రబాబు గానీ టీడీపీ ఎమ్మెల్యేలు గానీ సభకు రాలేదు. దానికి కారణం ఏమిటంటే… శాసనమండలిని రద్దు చేయాలని వైసీపీ సభ్యులు కోరతారు… అప్పుడు దానిని వ్యతిరేకించక తప్పని పరిస్థితి చంద్రబాబుది. శాసమండలి ఉండాలని గట్టిగా వాదించాల్సిన పరిస్థితి చంద్రబాబుది.

అయితే ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కొత్త విద్య నేర్చారు. బాబు ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా బాబు అంతకు మునుపే ఏమైనా మాట్లాడి ఉంటే ఆ వీడియోలను అసెంబ్లీలో ప్లే చేసి చూపిస్తున్నారు.

ఇదే ఇప్పుడు చంద్రబాబుకు మింగుడు పడని సమస్య.

ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మండలి రద్దును వ్యతిరేకిస్తే… 2004 జూలై 08న ఇదే చంద్రబాబు అసెంబ్లీలో మండలి ఎంత వృధానో, ఎంత దండగో, ఎంత అనవసరపు ఖర్చో వివరాలతో చేసిన సుధీర్ఘ ప్రసంగాన్ని అధికారపక్షం వీడియో వేసి చూపిస్తుందని బయపడే ఈరోజు చంద్రబాబు సభకు రాలేదని విమర్శకులు అంటున్నారు.