మరో షెడ్యూల్ పూర్తిచేసిన ప్రభాస్

సెట్స్ మీదకు రావడమే ఆలస్యం. వచ్చిన తర్వాత ఇక గ్యాప్స్ ఇవ్వడు ప్రభాస్. తన కొత్త సినిమా విషయంలో ఇదే రిపీట్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇంకో షెడ్యూల్ పూర్తిచేశాడు ప్రభాస్. దీంతో ఈ మూవీకి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయినట్టయింది. నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సాహో టైమ్ లోనే ఈ సినిమాను స్టార్ట్ చేశాడు ప్రభాస్. పారిస్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కంప్లీట్ అయింది. అంతే.. ఆ తర్వాత పూర్తిగా సినిమాను పక్కనపెట్టేశాడు. అలా 6 నెలల గ్యాప్ తర్వాత తిరిగి ఈ సినిమాను స్టార్ట్ చేసిన ప్రభాస్.. చకచకా షూట్ పూర్తిచేస్తున్నాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన సెట్ లో రీసెంట్ గా ప్రభాస్-పూజాహెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా పాల్గొంది. తాజాగా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేస్తామంటూ కొన్ని రోజుల కిందట మేకర్స్ ప్రకటించారు. అయితే సెట్స్ అన్నీ అందుబాటులోకి రావడంతో ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.