ఓవర్సీస్ లో బన్నీకి నాన్-బాహుబలి రికార్డ్

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అందరూ తప్పుడు లెక్కలే చెబుతున్నారు. ఫిక్స్ డ్ హయ్యర్లు, జీఎస్టీ ఎమౌంట్స్ కలిపి చెబుతున్నారు. గ్రాస్ ను కూడా షేర్ కింద చెబుతున్న మనుషులు ఉన్నారిక్కడ. కానీ ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్స్ ట్రాకింగ్ పక్కాగా ఉంటుంది. అలా ఓవర్సీస్ వసూళ్ల గురించి మాట్లాడుకుంటే.. అల వైకుంఠపురములో సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా తాజాగా భరత్ అనే నేను సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను కూడా అధిగమించింది. తద్వారా టాప్-10 లిస్ట్ లో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఈ సినిమా కంటే కాస్త ముందుగా రంగస్థలం మూవీ ఉంది. ఆ సినిమాను కూడా మరో 48 గంటల్లో ఇది క్రాస్ చేస్తుందని అక్కడి ట్రేడ్ చెబుతోంది. అదే కనుక జరిగితే ఓవర్సీస్ లో నాన్-బాహుబలి రికార్డు బన్నీదే అవుతుంది.

అంతేకాదు.. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సినిమాల్లేవు కాబట్టి, కంప్లీట్ రన్ లో ఈ సినిమా బాహుబలి-1ను కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. బాహుబలి-1ను ఇది క్రాస్ చేస్తుందా లేదా అనేది చెప్పలేం కానీ.. లిస్ట్ లో మూడో స్థానం మాత్రం పక్కా.