ఆటైమ్‌లో 17 మంది ఎమ్మెల్యేలు ఎటువెళ్లారు?

ఏపీ మండ‌లి ర‌ద్దు తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందింది. అయితే ఇదే స‌మ‌యంలో కొంత అనుభ‌వం లేమి వైసీపీలో కనిపించింది. మండ‌లి ర‌ద్దు అనేది ఒక రాజ్యాంగ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌. ఈ తీర్మానంపై ఓటింగ్ జ‌రుగుతోంది. అయితే స‌భ‌లో ప్లోర్ మేనేజ్‌మెంట్ చేసే సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. దీంతో కొంత గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

అసెంబ్లీలో వైసీపీ స‌భ్యుల సంఖ్య 151. ఇందులో స్పీక‌ర్‌ను మిన‌హాయిస్తే వైసీపీ బ‌లం 150. బిల్లు స‌మ‌యంలో అనుకూలంగా 133 ఓట్లు ప‌డ్డాయి. అంటే 17 మంది ఆ టైమ్‌లో స‌భ‌లో లేరు.ఈ ఎమ్మెల్యేలు ఎటు పోయారు అనేది చ‌ర్చ జ‌రిగింది. ఇంత కీల‌క స‌మ‌యంలో వారు ఎటు వెళ్లారు అని ప‌లువురు ఆరా తీశారు.

ఈ 17 మంది ఎమ్మెల్యేల్లో విప్ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డితో పాటు ఓ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు లాబీల్లో చిక్కుకుపోయార‌ట‌. ఓటింగ్ స‌మ‌యంలో లాబీ డోర్లు మూసివేస్తారు. దీంతో బ‌య‌ట‌కు వెళ్లిన వారు లోప‌లికి రాలేక‌పోయారు. ఇంకా కొంద‌రు అనారోగ్యంతో ప‌లు ఆసుప‌త్రుల్లో చికిత్స‌పొందుతున్నారు. అయితే స‌భ‌లో ప్లోర్ మేనేజ్‌మెంట్ చేయాల్సిన నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ శాసనసభలో వైసీపీ ఫ్లోర్‌ మేనేజ్‌మెంట్‌పై సీరియస్‌ అయ్యారు. ఓటింగ్‌ సమయంలో ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు గైర్హాజరుకావడం ఏంటని జగన్‌ ప్రశ్నించారు. మండలి తీర్మానంపై ఓటింగ్‌ ఉందని సభ్యులకు ముందే ఎందుకు చెప్పలేదని బాధ్యులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘ‌టన‌లు మ‌ళ్లీ పున‌రావృతం కావొద్ద‌ని ఆయ‌న సీరియస్ గా ఎమ్మెల్యేల‌కు చెప్పారు.