సరిలేరు నీకెవ్వరు 16 రోజుల వసూళ్లు

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి తాజాగా మరోసారి వసూళ్లు రిలీజ్ చేశారు. విడుదలైన 16 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెప్పుకున్నారు.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 16 రోజుల్లో 131 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. తద్వారా తమదే నాన్-బాహుబలి రికార్డు అని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి చెబుతున్న వసూళ్లన్నీ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

అటు యూనిట్ మాత్రం తమవి జెన్యూన్ నంబర్లని, రియల్ ఫిగర్లని చెబుతోంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 16 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

  • నైజాం – రూ. 36.70 కోట్లు
  • సీడెడ్ – రూ. 14.89 కోట్లు
  • ఉత్తరాంధ్ర – రూ. 18.64 కోట్లు
  • ఈస్ట్ – రూ. 10.85 కోట్లు
  • వెస్ట్ – రూ. 7.13 కోట్లు
  • గుంటూరు – రూ. 9.52 కోట్లు
  • నెల్లూరు – రూ. 3.84 కోట్లు
  • కృష్ణా – రూ. 8.50 కోట్లు