లుంగీతో “శ్రీకారం” చుట్టిన శర్వానంద్

చాన్నాళ్ల కిందటే శ్రీకారం అనే సినిమా స్టార్ట్ చేశాడు శర్వానంద్. జాను షూటింగ్ టైమ్ లో ప్రమాదం జరగడంతో కొన్నాళ్లు బెడ్ రెస్ట్ తప్పలేదు. ఆ తర్వాత వెంటనే జాను సినిమా పూర్తిచేయాల్సి వచ్చింది. అలా కాస్త ఆలస్యమైంది శ్రీకారం సినిమా. ఎట్టకేలకు ఈ సినిమా కూడా రెడీ అయింది. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రూరల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమౌతుంది. లుంగీ కట్టుకొని, భుజంపై టవల్ తో కనిపిస్తున్నాడు శర్వానంద్. పొలం గట్టుపై నడుస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నాడు. కేవలం టైటిల్ మాత్రమే కాదు, సినిమాలో కూడా తెలుగుదనం ఉంటుందని ఈ ఫస్ట్ లుక్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్.

‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను కిషోర్ బి. డైరెక్ట్ చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ వేసవికి విడుదల చేయబోతున్నారు.

' ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి ' Presenting the first look of #Sreekaram ❤️Summer 2020 release!#SreekaramFL#Sharwanand #KishoreB #Sharwa29

Publiée par Sharwanand sur Dimanche 26 janvier 2020