జూనియర్ ప్రపంచకప్ లో క్వార్టర్స్ సమరం

  • ఆస్ట్ర్రేలియాతో భారత్ అమీతుమీ

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్-19 ప్రపంచకప్ లో …క్వార్టర్ ఫైనల్స్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ భారత్, రన్నరప్ ఆస్ట్ర్రేలియా సై అంటే సై అంటున్నాయి. పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా బారత్-కంగారూ పోరు జరుగనుంది.
బ్లూమ్ ఫాంటెయిన్ , కింబర్లీ స్టేడియంలో గత రెండువారాలుగా జరుగుతున్న ఈటోర్నీ గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన భారత్..అలవోకగా క్వార్టర్ ఫైనల్స్ లీగ్ కు చేరుకోగలిగింది.

గ్రూపు ప్రారంభమ్యాచ్ లో శ్రీలంకను 90 పరుగులు, రెండోమ్యాచ్ లో పసికూన జపాన్ ను 10 వికెట్లతోనూ ఊదిపారేసిన భారత్…మూడోపోటీలో న్యూజిలాండ్ ను 44 పరుగులతో చిత్తు చేయడం ద్వారా మూడుకు మూడుమ్యాచ్ లూ నెగ్గిన జట్టుగా నిలిచింది.

మరోవైపు గతటోర్నీ రన్నరప్ ఆస్ట్ర్రేలియా సైతం తన గ్రూపులో అత్యధిక విజయాలు సాధించడం ద్వారా క్వార్టర్స్ కు అర్హత సాధించగలిగింది.

భారత కుర్రాళ్ల సత్తాకు సవాల్…

లీగ్ దశలో అలవోక విజయాలు సాధించిన భారతజట్టుకు…క్వార్టర్ ఫైనల్స్ లో ఆస్ట్ర్రేలియా నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ప్రియం గార్గ్ నాయకత్వంలోని భారతజట్టులో యశస్వీ జైస్వాల్, రవి బిష్నోయ్,దివ్యాంశు సక్సేనా, అనుకోల్కేర్, జురేల్ లాంటి మేటీ ఆటగాళ్లున్నారు.

కంగారూ జట్టులోని భారత సంతతి లెగ్ స్పిన్నర్ సంఘా సవాలు విసురుతున్నాడు. ప్రపంచకప్ ఫైనల్స్ కు ఆరుసార్లు చేరి ఇప్పటి వరకూ నాలుగుసార్లువిజేతగా నిలిచిన భారతజట్టు ఐదో టైటిల్ కు గురిపెట్టింది. ప్రస్తుత 2020జూనియర్ ప్రపంచకప్
లీగ్ దశ నుంచే ఇంగ్లండ్ జట్టు ఇంటిదారి పట్టగా…న్యూజిలాండ్, భారత్, విండీస్, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాజట్లు చేరుకొన్నాయి.

ఇదీ క్వార్టర్స్ లైనప్…

క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ తో ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్ తో సౌతాఫ్రికా, పాకిస్థాన్ తో అప్ఘనిస్థాన్, వెస్టిండీస్ తో న్యూజిలాండ్ జట్లు ఢీ కోనున్నాయి.