Telugu Global
NEWS

విశాఖ రాజధాని, వైఎస్ వివేకా కేసుపై స్పందించిన వైసీపీ సర్కారు

విశాఖ రాజధానిగా అనువు కాదని జీఎన్ రావు కమిటీ సూచించిందని.. తుఫాన్లు వస్తే విశాఖ మునిగిపోతుందని.. అది రాజధానిగా పనికిరాదని టీడీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై అధికారికంగా స్పందించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘తుపాన్లు వస్తే మాత్రం విశాఖ కొట్టుకుపోతుందా?… తుఫాన్లతో విశాఖకు పెద్దగా నష్టం ఉండదు’  అని స్పష్టం చేశారు. […]

విశాఖ రాజధాని, వైఎస్ వివేకా కేసుపై స్పందించిన వైసీపీ సర్కారు
X

విశాఖ రాజధానిగా అనువు కాదని జీఎన్ రావు కమిటీ సూచించిందని.. తుఫాన్లు వస్తే విశాఖ మునిగిపోతుందని.. అది రాజధానిగా పనికిరాదని టీడీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై అధికారికంగా స్పందించారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘తుపాన్లు వస్తే మాత్రం విశాఖ కొట్టుకుపోతుందా?… తుఫాన్లతో విశాఖకు పెద్దగా నష్టం ఉండదు’ అని స్పష్టం చేశారు. అమరావతికి వరద ముప్పు పొంచి ఉందని.. దానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని.. ఐదేళ్లకో, పదేళ్లకో వరద వస్తూనే ఉంటుందని బొత్స క్లారిటీ ఇచ్చారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని మాత్రమే మండలి చైర్మన్ ను కోరామన్నారు.

ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తెకు ఆవేదన ఉండడం తప్పు కాదని.. ఆ అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని బొత్స క్లారిటీ ఇచ్చారు.

First Published:  29 Jan 2020 6:41 AM GMT
Next Story