సెన్సార్ పూర్తిచేసుకున్న అశ్వథ్థామ

మరో 2 రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ సినిమా. నాగశౌర్య-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఇక్కడ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న అంశం సినిమా రన్ టైమ్. అవును.. ఈ సినిమా కేవలం 133 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. స్మోకింగ్ యాడ్స్ కూడా తీసేస్తే, సినిమా నిడివి ఇంకా తక్కువన్నమాట.

ఇంత తక్కువ నిడివితో అశ్వథ్థామ వస్తోందంటే, కచ్చితంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. అటు నాగశౌర్య మాటలు కూడా అలానే ఉన్నాయి. ఎలాంటి పక్కచూపులకు పోకుండా, నిజాయితీగా కథను నమ్మి తీశామని అంటున్నాడు. అంతేకాదు.. సినిమాలో బూతద్దం పెట్టి వెదికినా కామెడీ కనిపించదని చెబుతున్నాడు. సీరియస్ కథను, అంతే సీరియస్ గా సిన్సియర్ గా చేశామంటున్నాడు నాగశౌర్య.

నాగశౌర్య నమ్మకానికి తగ్గట్టే సెన్సార్ టాక్ కూడా ఉంది. సినిమా చాలా బాగుందంటున్నారు సెన్సార్ సభ్యులు. మరీ ముఖ్యంగా మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో అశ్వథ్థామ లాంటి సినిమాలు రావడం చాలా అవసరం అని అభిప్రాయపడుతున్నారు.

సెన్సార్ టాక్ తో శౌర్య ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సొంత బ్యానర్ పై వస్తున్న సినిమా కావడంతో పాటు ఈ సినిమాకు తనే స్వయంగా కథ కూడా రాయడంతో.. అశ్వథ్థామ రిజల్ట్ పై నాగశౌర్య చాలా టెన్షన్ తో ఉన్నాడు